మరోమారు ఉద్రిక్తత...ప్రగతి భవన్ ముట్టడించేందుకు యత్నం

byసూర్య | Sat, Jan 15, 2022, 05:06 PM

తెలగాణలో జీవో 317పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జీవో 317ను రద్దు చేయాలని తెలంగాణవ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.. తాజాగా ప్రగతి భవన్‌ను ముట్టడికి టీచర్స్‌ యత్నించారు. దీంతో ప్రగతిభవన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు 70 మందికి పైగా టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట నుంచి ప్రగతిభవన్ వరకు పోలీసులు మోహరించారు. వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. అసంబద్ధంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టారని, సీనియార్టీ ప్రకారం కేటాయింపు జరగలేదని, 317 జీవోతో భార్యాభర్తలను విడదీస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఉద్యోగులను వేరే చోటుకు బదిలీ చేయడం అన్యాయమన్నారు.. ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీచర్లు ఆరోపిస్తున్నారు. 317 జీవో రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని వెల్లడించారు. టీచర్ల అరెస్టుపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ స్పందించారు.. 317 జీవోను సవరించాలంటూ ప్రగతిభవన్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న టీచర్లను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.. అరెస్టు చేసిన టీచర్లందరినీ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ‘స్థానికత’కు గొడ్డలిపెట్టుగా ఉన్న 317 జీవోను వెంటనే సవరించాలన్నారు. 317 జీవోను సవరించే దాకా ఉద్యోగ, ఉపాధ్యాయులు చేసే ఉద్యమానికి బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని మార్చుకోవాలని సూచించారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న పోరాటాలను ఉధృతం చేస్తామని సంజయ్ ప్రకటించారు.


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM