ప్రాణం తీసిన మాంజా... గాలిపటాలు ఉన్నచోట జర జాగ్రత్త మరి

byసూర్య | Sat, Jan 15, 2022, 08:36 PM

సంక్రాంతి సంబరాలలో విషాదం చోటుచేసుకుంది.. క్రాంతి సీజన్ లో గాలిపటాలు ఎగరవేయడం ఓ సరదా. అయితే, గాలిపటాలకు కట్టే మాంజా (గాజు ముక్కల పొడి అద్దిన దారం) చాలా ప్రమాదకరమైనదని పర్యావరణవేత్తలు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. మాంజా చుట్టుకుని అనేక పక్షులు మృత్యువాత పడడం, కాళ్లు, రెక్కలు కోల్పోయిన ఘటనలు కోకొల్లలు. తాజాగా, తెలంగాణలో ఓ వ్యక్తి గాలిపటం మాంజా కారణంగా మృతి చెందాడు. మంచిర్యాలలో ఈ ఘటన జరిగింది. భీమయ్య (36) అనే వ్యక్తి తన భార్యతో కలిసి బైక్ పై వెళుతుండగా గాలిపటం మాంజా గొంతుకు చిక్కుకుంది. ఆ మాంజా భీమయ్య గొంతును కోసేసింది. బైక్ పై వెళుతున్నందున గొంతు లోతుగా తెగడంతో మరణం సంభవించింది. ఈ ఘటనతో భీమయ్య కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


Latest News
 

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM