కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలి
 

by Suryaa Desk |

ప్రధానితో కరోనా మీటింగ్ లో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ నాయకురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు దేశ ప్రధాని ప్రజల కోసం సమయాన్ని కేటాయిస్తే.. కేసీఆర్ మాత్రం చాలా బిజీగా ఉన్నారరని విమర్శించారు. సీఎం కేసీఆర్ వ్యవహారశైలిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని డీకే అరుణ వ్యాఖ్యానించారు. కేంద్రంపై బురద చల్లే ముఖ్యమంత్రి.. దేశ ప్రధానమంత్రి ప్రజల ఆరోగ్యం, వారి ఆర్థిక పరిస్థతులపై ఎలాంటి భారం పడకుండా చూడాలని రాష్ట్రాల సీఎంలకు సూచనలు ఇచ్చిన విషయం గురించి కనీసం తెలుసుకోవాలన్న ఆలోచన కూడా కేసీఆర్‌కు లేదని డీకే అరుణ దుయ్యబట్టారు. దేశ ప్రధాని ప్రజల కోసం తన సమయాన్ని కేటాయిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం చాలా బిజీగా ఉన్నారని డీకే అరుణ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ వ్యవహారశైలిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని డీకే అరుణ విమర్శించారు.


Latest News
ఆ విద్యార్థులకు శుభవార్త Tue, Jan 18, 2022, 12:01 PM
మైనర్లు పట్టుబడితే పై తల్లిదండ్రులకు జైలు శిక్ష Tue, Jan 18, 2022, 11:39 AM
అప్పుల బాధ తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య Tue, Jan 18, 2022, 11:11 AM
కేసులు పెరిగితేనే నైట్ కర్ఫ్యూ.! Tue, Jan 18, 2022, 10:45 AM
ఘోర రోడ్డు ప్రమాదం... Tue, Jan 18, 2022, 10:37 AM