వ్యాక్సినేషన్‌లో తెలంగాణ రాష్ట్రం రికార్డు
 

by Suryaa Desk |

తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించింది. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ తొలి డోస్‌ 100 శాతం పూర్తి చేసిన తొలి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తెలంగాణ ఇప్పుడు టీకాలు వేయడంలో మరో మైలురాయిని చేరుకుందని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఈరోజు రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ 5 కోట్ల డోస్‌లు దాటింది. వ్యాక్సిన్ల పంపిణీ 5 కోట్ల డోస్‌లు దాటడంపై ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఉంటూ నిరంతరం టీకాలు వేసేందుకు కృషి చేస్తున్న వైద్య సిబ్బందితో పాటు పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖల సిబ్బందిని మంత్రి హరీశ్ రావు అభినందించారు.


Latest News
పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా Fri, Jan 28, 2022, 09:32 PM
జగిత్యాల మెడికల్ కాలేజీ పనుల్లో కలెక్టర్ అసంతృప్తి Fri, Jan 28, 2022, 09:10 PM
జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించoడి :ఎమ్మెల్యే కె.మాణిక్యా రావు Fri, Jan 28, 2022, 08:57 PM
'TSMDC' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ Fri, Jan 28, 2022, 08:47 PM
హైదరాబాద్‌లో మొబైల్ ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ Fri, Jan 28, 2022, 08:43 PM