కార్మికుల సంక్షేమానికి ఎల్లవేళలా ముందుంటా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

byసూర్య | Tue, Jan 11, 2022, 02:49 PM

కార్మికుల సంక్షేమానికి ఎల్లవేళలా ముందుంటానని ఎమ్మెల్యే కేపి వివేకానంద్  పేర్కొన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో గల ఈస్ట్ కోస్ట్ మాగ్నెట్స్ కంపెనీలో పని చేస్తున్న 49 మంది కార్మికులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్  ఈరోజు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యాజమాన్యం మరియు కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి 3 సంవత్సరాల పాటు రూ.6200/- వేతన ఒప్పందం యాజమాన్యంతో ఒప్పించారు. ఈ సందర్భంగా కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కార్మికుల హక్కులు కాపాడేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కార్మికులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఎండి ధీరజ్ సర్థా, యూనియన్ సభ్యులు వై.త్రిమూర్తులు, ఎన్.శ్రీనివాస్ రావు, దుర్గాప్రసాద్, ప్రసంజిత్ మండల్, డి.అశోక్ బాబు, అముల్, మనింద్ర నాథ్ దాస్ పాల్గొన్నారు.


Latest News
 

ఓయూ పీజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల Sun, Sep 25, 2022, 12:45 PM
రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పిన కేటీఆర్, హరీశ్ Sun, Sep 25, 2022, 11:47 AM
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ఆదేశం Sun, Sep 25, 2022, 11:28 AM
బతుకమ్మ వేడుకల నేపథ్యం మీకోసం Sun, Sep 25, 2022, 10:42 AM
ముషీరాబాద్‌ డిగ్రీ విద్యార్థిని పై ప్రేమోన్మాది దాడి Sun, Sep 25, 2022, 10:29 AM