ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు , వైద్యుని దగ్గరకు వెళ్తే వైద్యుడు నాలుక చూపించు అని అంటారు . ఎందుకో తెలుసా...?

byసూర్య | Tue, Jan 11, 2022, 02:41 PM

మన ఆరోగ్యం బాగోలేదు అని వైద్యుడిని సంప్రదిస్తే , నాలుకను చూపండి అంటారు . అవునా కాదా ? మనం కూడా అలానే చేస్తాం కానీ ఎలా ఎందుకు  అడుగుతారు ? నాలుక చూడటం వలన మన సమస్య ఎలా తెలుస్తుంది అనే అనుమానం రావడం కానీ ఒకవేళ వచ్చిన దానికి సమాధానము తెలియదు మనలో చాల మందికి . మరి ముఖ్యంగా , జ్వరం,తలనొప్పి,విరేచనాలు ఇలా ఏ ప్రాబ్లంతో వెళ్ళితే మొదటగా నాలుకనే చెక్ చేస్తారు . నాలుకను పరిశీలించడం వలన నాలుక యొక్క లక్షణాలను బట్టి , దాని పరిస్థితిని బట్టి , మన ఆరోగ్యానికి సంభందించిన కొన్ని విషయాలు తెలుస్తాయి అని వెల్లడి చేసారు కొంతమంది నిపుణులు . వాటిల్లో కొన్ని ఇప్పుడు  మనం తెలుసుకుందాం .
-ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు నాలుక మీద  కొన్ని సార్లు  తెల్ల మచ్చలు, నల్లమచ్చలు ఏర్పడతాయి . ఈ తెల్ల మచ్చలకు కారణం ఫంగస్. ఫంగస్ ఇన్ఫెక్షన్ల కారణంగానే ఈ మచ్చలు ఏర్పడతాయి. దాని ద్వారా ఫంగస్ తొలగించే దానికి వైద్యులు మందులు ఇవ్వడం జరుగుతుంది .
-నాలుక ఎర్రగా మారిపోవడం , నాలుక పొక్కడం , శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం.. ఇవన్నీ ఐరన్‌ లోపం, రక్తహీనత ఉన్నాయని చెప్పే లక్షణాలు.
-నాలుక మీద చుక్కల మాదిరి  నల్లగా కనిపిస్తుంది. విపరీతంగా పొగ త్రాగడం వల్ల లేదా యాంటీబయాటిక్స్‌  ఎక్కువ వాడటం వల్ల వచ్చే ఫంగస్‌ కారణమై ఉంటుంది.
- కొంతమంది రోగులలో నాలుక వాపు రావడం జరుగుతుంది . నాలుక వాచినప్పుడు తినడానికి,మాట్లాడానికి ఇబ్బందిగా ఉంటుంది. నాలుక వాయడంతో పాటు -కొన్ని సార్లు నాలుక రంగు కూడా మారుతుంది.  ఇది శరీరంలో ఇన్‌ఫెక్షన్లు బాగా పెరిగిపోయినప్పుడు కనిపించే లక్షణం.
-నాలుక రంగు మారడం అనేది కొందరిలో కామెర్లు, రక్తహీనత లేదా శరీరానికి సరిపడా ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల కూడా కావచ్చు.
-కొంత మందిలో నాలుక ఒక పక్కకు వాలిపోతుంది . మాట్లాడటానికి చాల ఇబ్బంది  చేస్తుంది . నాలుక ఒక పక్కకు వాలిపోతే అది పక్షవాత లక్షణంగా పరిగణిస్తారు.
-నాలుక  అదరటం , వణకడం కనిపిస్తే అది థైరాయిడ్‌ గ్రంధి సరిగ్గా పనిచేయడం లేని  కారణంగా జరుగుతుంది . లేదా కొన్ని రకాల నరాల వ్యాధుల వల్ల గానీ, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ సమస్య వల్ల గానీ కావచ్చు.
అయితే ఆరోగ్యమైన, పరిశుభ్రమైన నాలుక వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఫ్రెష్ నెస్ ఇంప్రూవ్ చేయడం నుంచి.. శ్వాస అందించడం వరకు.. అనేక లాభాలున్నాయి. నాలుకను క్లీన్ చేయడం వల్ల పొందే లాభాలేంటో ఒక సారి చూద్దాం . నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల  నోరు మంచి వాసన కలిగి ఉంటుంది . ఏది తిన్నా కారం, ఉప్పు, పులుపు, తీపి వంటి రకరకాల రుచులను తెలుపుతుంది . సగటున ప్రతి ఒక్కరికి 10 వేల రుచి గుళికలు  ఉంటాయి. ఇవి ప్రతి రెండు వారాలకు రీప్లేస్ అవుతూ ఉంటాయి. ఒకవేళ నాలుకను సరిగ్గా శుభ్రపరచకపోతే,  టేస్ట్ బడ్స్ ఉత్పత్తి సరిగా జరగదు . దీనివల్ల రుచి తెలియక ఆహారంలో ఎక్కువ మోతాదులో ఉప్పుని, చక్కెరను కలుపుకుని తింటారు. కాబట్టి నాలుక భాగంను ఎల్లప్పుడూ శుభ్రంగా చూసుకోవడం చాల మంచి పద్దతి .
 నాలుకని శుభ్రంగా ఉంచుకోవడం వలన దుర్వాసనను పోగొడుతుంది. రోజు బ్రెష్ చేయడం వల్ల బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. రోజూ నాలుకను శుభ్రం చేసుకోవడం, నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. కొన్ని అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. నాలుకను శుభ్రం చేసుకోకపోతే, బ్యాక్టీరియా పెరిగిపోయి చిగుళ్ల  వాపు వచ్చి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కాబట్టి రెగ్యులర్ గా నాలుకను శుభ్రం చేసుకుంటే చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.బ్రష్ తో దంతాలు శుభ్రం చెయ్యడం వలన  వాటిలో చిక్కుకున్న ఆహారాన్ని, బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు  నాలుకను కూడా శుభ్రం చేసుకోవడం వల్ల వయసు పెరిగినా  కానీ దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM