కల్నల్ సంతోష్ బాబుకి మహావీర్ చక్ర పురస్కారం
 

by Suryaa Desk |

గాల్వన్ లోయలో చైనా సైనికులతో పోరాడి వీరమరణం పొందిన తెలంగాణలోని సూర్యాపేట నివాసి కల్నల్ సంతోష్ బాబును కేంద్రం మహావీర్ చక్ర అవార్డుతో సత్కరించింది. ఆయన మరణానంతరం ప్రభుత్వం ఆయనకు మహావీర చక్ర అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా సంతోష్‌ సతీమణి, ఆయన తల్లి అవార్డును అందుకున్నారు. గాల్వన్ వ్యాలీ వద్ద భారత్-చైనాల మధ్య జరిగిన ఘర్షణల్లో సంతోష్ బాబు సహా కనీసం 21 మంది భారత సైనికులు మరణించారు. ఆయన సేవలకు గుర్తుగా కేంద్రం మరణానంతరం మహావీర చక్ర అవార్డును ప్రకటించింది. సంతోష్‌బాబుతో పాటు విధి నిర్వహణలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన పలువురు సైనికులకు అమరవీరుల కుటుంబాలకు రాష్ట్రపతి గ్యాలరీ అవార్డులను అందజేశారు.


Latest News
కాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 11:24 AM
అదుపు తప్పి హుస్సేన్‌సాగర్‌లో దూసుకెళ్లిన కారు.. ముగ్గురికి గాయాలు Sun, Nov 28, 2021, 11:19 AM
నాలుగు లక్షల విక్రయాల మార్కును దాటినా రెనాల్ట్ క్విడ్ Sun, Nov 28, 2021, 12:42 AM
ఫలక్‌నుమా రెండో దశ పనులు త్వరలో ప్రారంభం Sun, Nov 28, 2021, 12:36 AM
నవంబర్ 28న టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 12:31 AM