ఆ వె నడుంనొప్పికి చెక్ పెట్టండిలా

byసూర్య | Tue, Nov 23, 2021, 12:16 PM

మహిళలకు ప్రెగ్నెన్సీ టైంలో రకరకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. అందులో నడుము నొప్పి ఒకొటి. తొమ్మిది నెలలపాటు బ్యాక్ పెయిన్‌ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ నడుము నొప్పి కారనంగా రోజువారీ పనులకు చేసుకోలేరు, మంచిగా నిద్రపోలేరు. అయిత బ్యాక్ పెయిన్‌ రకరకాల కారణాల వల్ల వస్తుంది. నెలలు నిండిన తర్వాత లోపల బిడ్డ ఎదుగుదల వల్ల శరీరంపై అదనపు ప్రెజర్ పడుతుంది. దీంతో బ్యాక్ పెయిన్ ఎక్కువవుతుంది. ప్రెగ్నన్సీ సమయంలో రిలాక్సిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది పెల్విక్ ఏరియాలో లిగమెంట్స్, జాయింట్స్‌ను మృదువుగా చేస్తుంది. వెన్నులో లిగమెంట్స్ ను కూడా లూజ్ చేస్తుంది. దాంతో నొప్పి వస్తుంది. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ బ్యాక్‌ పెయిన్‌ను మేనేజ్ చేసుకోవచ్చు. గర్భంతో ఉన్నప్పుడు కదలికలపై దృష్టి పెట్టాలి. స్ట్రెయిట్‌గా నించోవాలి. పోశ్చర్ తగిన విధంగా ఉంటే బ్యాక్ పెయిన్‌ను అరికట్టవచ్చు. పాదాలపై ఒత్తిడి పడని చెప్పులు వేసుకోవాలి. అలాగే ఒక్కసారిగా కిందకు కూర్చుని ఒక్కసారిగా పైకి లేవడం వంటివి చేయకూడదు. సౌకర్యంగా నిద్రపోవడానికి ప్రయత్నించాలి. మెత్తగా ఉండే పరుపుపై నిద్రించాలి. కొన్నిసార్లు పరుపు వల్ల కూడా బ్యాక్ పెయిన్ సమస్య వస్తుంది. థర్డ్ ట్రైమెస్టర్‌లో పక్కకు తిరిగి పడుకోవడం మంచిది. అలాగే మంచం నుంచి కిందకు జాగ్రత్తగా దిగాలి. మంచం మీంచి దిగేటప్పుడు పక్కకు తిరిగి సిట్టింగ్ పొజిషన్‌లోకి వచ్చి మెల్లగా దిగాలి. అలాగే వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలోపేతమవుతాయి. దాంతో శరీరం ప్రెగ్నన్సీ సమయంలో తలెత్తే నొప్పులను తట్టుకోగలుగుతుంది. మెడిటేషన్ వల్ల నడుము నొప్పి తట్టుకునే స్థాయి పెరుగుతుంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM