క్యారెట్లతో చర్మాన్ని సంరక్షించుకోండిలా

byసూర్య | Tue, Nov 23, 2021, 08:50 AM

శీతాకాలంలో చర్మం పగులుతుండటం సహజమే. చర్మం పొడిగా మారి కొందరికి దురద కూడా వస్తుంటుంది. అయితే శీతాకాలంలో చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుకోవాలంటే అందుకు క్యారెట్ ఎంతగానో పనిచేస్తుంది. క్యారెట్ తో చర్మాన్ని ఎలా సంరక్షించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. క్యారెట్ లో సగం ముక్క తీసుకుని దాన్ని తురుం పట్టి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ లో ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ పాలు వేసి బాగా కలిపి చర్మానికి రాయాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం తేమగా మారడంతో పాటు పగలకుండా ఉంటుంది. దీనిని ముఖానికి ఫేస్ ప్యాక్‌గా వేసుకోవచ్చు. చర్మం నుంచి విడుదలయ్యే నూనెలాంటి ద్రవాన్ని క్యారెట్లలో ఉండే విటమిన్ ఎ బయటకు పంపుతుంది. ఒక కప్పు క్యారెట్ జ్యూస్ తీసుకుని అందులో పెరుగు, శనగపిండి, నిమ్మరసంలను ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌గా వేసుకోవాలి. 30 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ఆయిలీ స్కిన్ నుంచి విముక్తి పొందవచ్చు. క్యారెట్ జ్యూస్, పెరుగు, ఎగ్ వైట్‌లను సమపాళ్లలో కలిపి మిశ్రమంగా చేసి దాన్ని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చర్మం తాజాగా మారి సౌందర్యం పెరుగుతుంది. క్యారెట్ జ్యూస్, రోజ్ వాటర్‌ను సమపాళ్లలో కలిపి స్ప్రే బాటిల్‌లో ఆ మిశ్రమాన్ని నింపాలి. దాన్ని సన్ ప్రొటెక్షన్ స్ప్రే గా వాడుకోవచ్చు. దీంతో సూర్యకాంతి, దుమ్ము, ధూళిల నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది. క్యారెట్ జ్యూస్, అలోవెరా జ్యూస్‌లను కలిపి చర్మానికి రాసుకుంటే చర్మ సౌందర్యం పెరుగుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. చర్మం పగలకుండా మృదువుగా ఉంటుంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM