శరీరంలోని గ్యాస్ పోవడానికి సరైన యోగాసనం

byసూర్య | Mon, Nov 22, 2021, 01:40 PM

మనం ఎంత జాగర్తగా ఉన్న కానీ మన శరీరంలో క్రొవ్వు మాత్రం పెరుగుతూనే ఉంటుంది దాని వలన వచ్చే ఆరోగ్య సమస్యలు అంత ఇంత కాదు .  ఈ క్రొవ్వు పేరుకుపోయే  అవయవం ని బట్టి మనకు వచ్చే ఆరోగ్య సమస్యలు (జబ్బులు )  స్థాయి ఉంటుంది . కాబట్టి మనిషి శరీరంలో క్రొవ్వు పెరగకుండా కాపాడటం  ఎంతో మంచిది . అలానే , మనిషికి గ్యాస్ సమస్య కూడా ఏంటో  ప్రమాదకరమైనది . దీని  వలన  మనిషి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చాల ఉన్నాయి .
 ఆహరం వేళకు  తీసుకోకపోవడం , తీసుకునే ఆహరం పట్ల శ్రద్ధ  లేకపోవడం , ఆహరం తిన్న వెంటనే నిద్ర పోవడం  లాంటివి శరీరంలో గ్యాస్ పెరగడానికి దోహదపడుతుంది .  అలానే ఇందులో ప్రమాదకరమైన గ్యాస్ మన ప్రేగు లోపల నిల్వ ఉండటం . ఇది  రాత్రి పూట  మనము ఆహరం తీసుకున్న వెంటనే నిద్రపోవడం వలన వస్తోంది . దీని వలన ప్రేగు లోపల నుండి మంట , ఉబకాయత్వం , గుండె పోటు  లాంటివి రావడానికి అవకాశం ఉంది .
దీనిని , మనం యోగ ఆసనాల వలన చక్కగా తగ్గించుకోవచ్చు . ఆ ఆసనం పేరే "పవన ముక్తాసనం ". రోజు పొద్దునే నిద్ర లేచిన వెంటనే ఈ ఆసనం  ఐదు నిముషాలు చెయ్యడం  వలన మన శరీరంలోని కొవ్వు కరుగుతుంది అలానే శరీరం లో ఉన్న గ్యాస్ బయటికి విడుదల అవుతుంది . ఇప్పుడు , ఎలా చెయ్యాలో చూద్దాం .
ముందుగా వెల్లికలాగా  పనుకుని కాళ్ళు ముందుకు చాచి పెట్టాలి . తరవాత ఒక కాలు మాత్రమే మోకాలు భాగంలో మడిచి , మోకాలు భాగాన్ని మీ పొట్ట భాగానికి తాకేలా ప్రయత్నం చెయ్యండి అదే సమయంలో మీ ముఖ భాగం మీ మొకాలుకి తాకేలా  ప్రయతించండి . ఇదే తరహాలో రెండవ కాలుతో కూడా చెయ్యండి . ఐతే ఒక కాలుతో చేసేటప్పుడు రెండవ కాలు నిటారుగా క్రింద  నేలకు  తాకేలా ఉంచాలి . ఇలాగ  ప్రతి రోజు నిద్ర లేవగానే నాలుగు సార్లు చెయ్యడం ద్వారా , శరీరంలోని క్రొవ్వు కరగడంతో పాటు , ప్రేగు భాగంలో ఉన్న గ్యాస్ కూడా బయటికి రిలీజ్ అవుతుంది అలానే మల మూత్ర విసర్జన సులభతరంగా ఉంటుంది . పొట్ట మొత్తం శుభ్రంగా ఉండటం వలన , గాలి పీల్చుకోవడానికి ఎక్కువ సౌకర్యం ఉంటుంది దాని వలన ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి .  


Latest News
 

మాజీ సర్పంచ్ ని పరామర్శించిన బోథ్ ఎమ్మెల్యే Thu, May 02, 2024, 03:05 PM
నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య ఉత్కంఠ పోరు.. Thu, May 02, 2024, 02:43 PM
మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం Thu, May 02, 2024, 02:08 PM
సీఎం రేవంత్ ను కలిసిన BRS మాజీ మంత్రి Thu, May 02, 2024, 02:08 PM
టీఆర్ఎస్ పార్టీలో చేరిక Thu, May 02, 2024, 01:58 PM