ఆరోగ్యకరమైన గుండె కోసం  వ్యాయామాలు తప్పనిసరి

byసూర్య | Mon, Nov 22, 2021, 01:43 PM

గుండె జబ్బులు అనగానే , భయాందోళన మొదలవుతుంది మనలో . దానికి కారణం అవి ప్రమాదకరమైనవిగా మారి ప్రాణాలు తీయడం .  కాబట్టి గుండె విషయంలో జాగర్త తీసుకోవడం అనేది చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు . అసలు ఈ గుండె సంబంధిత సమస్యలు (రోగాలు ) రావడానికి ప్రధాన కారణాలు  ఏంటో  చూద్దాం .
ప్రధానంగా , క్రొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహరం తీసుకోవడం , తీవ్రమైన మానసిక ఒత్తిడి , వాతావరణ కాలుష్యం , ధూమపానం , మద్యపానం లాంటి అలవాట్లు , అతిగా ఆలోచించడం , నిద్రలేమి తనం  లాంటి కారణాల వల్ల ఇలాంటి సమస్యలు  వస్తుంటాయి .
వీటి విషయంలో తగిన జాగర్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది . ఆహరం విషయంలో , మాంసాహారం తక్కువగా తీసుకోవడం , కేక్స్ , బర్గెర్స్ దూరంగా పెట్టడం లాంటివి మరియు ఇతర క్రొవ్వు సంబంధిత ఆహరం తక్కువగా తీసుకోవడం మంచిది .
కుటుంభం సమస్యలు , ఆర్ధిక సమస్యలవలన అతిగా అలోచించి మానసిక ఒత్తిడికి గురి అవ్వడం అలాంటివి చెయ్యకుండా మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి . ఆలోచన విధానం నెమ్మదిగా ఉండాలి ఎక్కువగా ఆవేశ పడటం చెయ్యకూడదు . దీని వలన ఆయాసం వచ్చి అందులో రక్త పోటు  పెరిగి లేదా తగ్గి  హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదముంది .
వాతావరణ కాలుష్యం మరియు ధూమపానం , మద్యపానం లాంటి అలవాట్ల వలన గుండె ఆరోగ్యం క్షిణిస్తుంది . దాని వలన , గాలి తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది . అలానే ధరించే దుస్తుల విషయంలో కూడా చాల జాగర్తలు పాటించాలి . శరీరానికి బిగుతుగా ఉండే వాటిని కాకుండా కొంచెం వదులుగా ఉన్న బట్టలు ధరాయించడం చాల మంచిది .
గుండె కి రక్త ప్రసరణ సజావుగా జరగడానికి , గుండె ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామాలు , యోగ చాల ఉపయోగకరం . ప్రొదున్నే వ్యాయామం చెయ్యడం , నడవటం , కొన్ని రకాల ఆటలు ఆడటం , రన్నింగ్ చెయ్యడం లాంటివి మంచిది . వీటి వలన శరీరం లోని క్రొవ్వు కరిగి వ్యర్ధ పదార్థ రూపంలో చెమటగా మారి బయటికి వస్తుంది అలానే , శరీరంలో గ్యాస్  వలన కూడా ప్రమాదాలు రాకుండా చేస్తాయి . 


Latest News
 

కాంగ్రెస్, బిజెపి పార్టీలవి మోసపూరిత వాగ్దానాలు Fri, Apr 19, 2024, 02:21 PM
రెజిమెంటల్ బజార్ లో శ్రీగణేశ్ పాదయాత్ర Fri, Apr 19, 2024, 01:40 PM
దుర్గా దేవస్థానం అష్టమ కళ్యాణ వార్షికోత్సవం ఆహ్వానం Fri, Apr 19, 2024, 01:40 PM
ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం Fri, Apr 19, 2024, 01:38 PM
ప్లాస్టిక్ విక్రయ దుకాణాల్లో తనిఖీలు Fri, Apr 19, 2024, 01:38 PM