రైతులకు సిద్దిపేట కలెక్టర్‌ వార్నింగ్‌

byసూర్య | Tue, Oct 26, 2021, 11:50 AM

సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామి రెడ్డి.. మరో వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు పై కలెక్టరేట్ లో అధికారులతో కలెక్టర్ వెంకట్రామి రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వెంకట్రామి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా లో ఒక ఎకరం లో వరి వేసిన ఖబడ్దార్, ఆ పరిధిలో వ్యవసాయ అధికారిని సస్పెండ్ చేస్తానని వార్నింగ్‌ ఇచ్చారు. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనని హెచ్చరించారు.ఇది నా హుకుం నేను కలెక్టర్ గా ఉన్నన్ని రోజులు ఇది అమలు అవుతుందని వార్నింగ్‌ ఇచ్చారు. హై కోర్ట్, సుప్రీం కోర్టు కి వెళ్లినా అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. ఒక్క కిలో వరి విత్తనాలు అమ్మినా.. షాప్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎంపీ లు, ఎమ్మెల్యే లు నుంచి సిపార్సులు తెచ్చిన ఇంకా లేట్ అవుతుందన్నారు. దీంతో సిద్దిపేట జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM