నా జీవితం తెలంగాణకు అంకితం: షర్మిల

byసూర్య | Mon, Oct 25, 2021, 07:56 PM

తెలంగాణకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నానని వైఎస్ షర్మిల అన్నారు. లేమూర్ గ్రామస్తులతో ఆమె మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ మంచోడు మంచోడు అంటే మంచం కోళ్లు ఎత్తుకెళ్లినట్లు సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ లాంటి మోసకారి చేతి నుంచి తెలంగాణకు విముక్తి కలగాలని షర్మిల ఆకాంక్షించారు.


తెలంగాణలో మహిళల సంక్షేమాన్ని పట్టించుకునే నాధుడే లేడని షర్మిల విమర్శించారు. ''అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందాలి. భార్యకు ఇస్తే భర్తకు, భర్తకు ఇస్తే భార్యకు ఇవ్వని పరిస్థితుల్లో మార్పు రావాలి. తెలంగాణ ప్రజలకు మేలు చేయాలనే నేను పార్టీ పెట్టా. తెలంగాణలోనే పెరిగా. ఇక్కడి వ్యక్తినే పెళ్లి చేసుకున్నా. నాకు ఈ ప్రాంతానికి సేవ చేసే హక్కు లేదా?. సొంత ఇంటి కల నెరవేరాలంటే వైఎస్సార్ సంక్షేమ పాలనా మళ్ళీ రావాలి. కేసీఆర్ పాలన పోవాలి, వైఎస్సార్ సంక్షేమ పాలనా తేవాలి. భార్యకు, భర్తకు ఇద్దరికీ పెన్షన్ రావాలంటే వైఎస్సార్ టీపీ అధికారంలోకి రావాలి. 5 వేలు ఇస్తూ 15 వేలు పట్టుకుంటున్నారు. కేసీఆర్ పాలన లో రైతులు బాగుపడ్డది లేదు. 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉద్యమకారుడని అధికారం అప్పగిస్తే ప్రజల సంక్షేమాన్ని పక్కకుపెట్టారు.'' అని షర్మిల మండిపడ్డారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM