నాగార్జునసాగర్ డ్యాం 1 క్రస్ట్ గేట్ ద్వారా నీటి విడుదల

byసూర్య | Mon, Oct 25, 2021, 06:12 PM

నాగార్జునసాగర్ డ్యాం 1 క్రస్ట్ గేట్ ద్వారా 8090 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగా ర్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.90 (311. 7462 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 8529 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 9076 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 400 క్యూసెక్కులు,


ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 30369 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 58264 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుండగా, అదే స్థాయిలో ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థా యి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 879.20 అడుగులు (183.8486 టీఎంసీలు) ఉంది. శ్రీశైలంకు 8244 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది.


Latest News
 

మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం Thu, May 02, 2024, 02:08 PM
సీఎం రేవంత్ ను కలిసిన BRS మాజీ మంత్రి Thu, May 02, 2024, 02:08 PM
టీఆర్ఎస్ పార్టీలో చేరిక Thu, May 02, 2024, 01:58 PM
అందరి మదిలో మోడీనే ఉన్నారు: బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి Thu, May 02, 2024, 01:56 PM
ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి Thu, May 02, 2024, 01:54 PM