దళితబంధు దేశానికే దిక్సూచిగా మారబోతోంది : ఎమ్మెల్యే ఆనంద్

byసూర్య | Mon, Oct 25, 2021, 06:25 PM

టీఆర్ఎస్ ప్లీనరీలో దళిత బంధుపై వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని దళితులందరూ తన బంధువులే అని తెలుపుతూ.. దళిత బంధు పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. గత పాలకులు దళితులను పట్టించుకోలేదు. దళితుల బాధలను చూసి చలించిపోయిన సీఎం కేసీఆర్.. దళిత బంధు పథకానికి అంకురార్పణ చేశారు. ప్రతి ఇంట్లో సంక్షేమం ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పథకాలను ప్రవేశపెడుతున్నారు. దళితుల వద్ద పెట్టుబడి లేకనే వెనుకంజలో ఉన్నారు.


దళితులు అత్యంత వివక్షను ఎదుర్కొన్నారు. ఉపాధి, ఉద్యోగాలు దళితులకు అందలేదు. ఇప్పటికీ కడుపునిండా తినని దళితులు ఉన్నారు. నిరక్ష్యరాసులు కూడా దళితుల్లోనే ఎక్కువ ఉన్నారు. ఈ దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు వస్తాయన్నారు. భారతదేశానికే ఈ పథకం దిక్సూచిగా మారబోతుందన్నారు. సంపన్న వర్గాలను, అణగారిన వర్గాలను సమాన స్థితికి తెచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. శ్రమించే పని చేసే జాతి దళితజాతి అని ఆనంద్ పేర్కొన్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM