మ్యాచ్ గెలిచాక పాక్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందంటే..

byసూర్య | Mon, Oct 25, 2021, 03:21 PM

టీ20 ప్రపంచకప్‎ను టీమిండియా జట్టు ఆదివారం ప్రియమైన ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఢీకొట్టింది. దాయాదితో మ్యాచ్ కావడంతో ఎక్కడలేని క్రేజ్‌ ఏర్పడింది. కానీ భారత్ జట్టు ఆ అంచనాలను కోహ్లీ సేన తలకిందులుగా చేసింది. అభిమానుల ఆశలన్నీ అడియాశలు చేసింది. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఎదురైన ఐదు ఓటములకు పాకిస్థాన్ పది వికెట్ల తేడాతో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. దుబాయ్ మైదానంలో టీమిండియా జట్టు ఓ పసికూనలా మారిపోయి అభిమానులు నిరాశపరిచింది. అయితే..పాక్ జట్టు అన్ని విభాగాల్లో బాగా రాణించింది. దీంతో ప్రపంచకప్‎లో పాక్‎పై వరుస విజయాల రికార్డు ఉన్న భారత్ జట్టు‎ను కోలుకోలేని దెబ్బతీసింది. పాక్ టీమ్ భారత్ జట్టుపై అలవోకగా విజయం సాధించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.


అంతకు ముందు టాస్ ఓడి భారత్ జట్టు బ్యాటింగ్ కు దిగింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా జట్టును పాక్ యువ పేసర్ షహీన్ షా గట్టి షాక్ ఇచ్చారు. టీమిండియా బ్యాటింగ్ ను కోలుకోలేని దెబ్బ తీశాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.


 


151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు అలవోకగా ఆడుతూ పాడుతూ..మ్యాచ్ ను ముగించింది. పాక్ ఆటగాళ్ల వికెట్ల తీయడానికి భారత్ బౌల్లర్లు నానా కష్టాలు పడ్డారు. ఎలాంటి బంతులు వేసిన పాక్ ఓపెనర్లు సింపుల్ గా ఆడుతూ..టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌ (55 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 నాటౌట్‌), బాబర్‌ ఆజమ్‌ (52 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 నాటౌట్‌) ఇద్దరే 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు.


 


మన లక్ష్యం వరల్డ్ కప్ గెలవడం..


 


భారత్ పై గెలిచిన పాకిస్థాన్ జట్టు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటుందని అందరు అనుకున్నారు. కానీ పాక్ జట్టు సంబరాలు చేసుకోలేదు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లాక కెప్టెన్ బాబర్ ఆజమ్ టీమ్ సభ్యులతో సమావేశయ్యాడు. 'మనం గెలిచింది ఒక్క మ్యాచ్ మాత్రమే'.. ఈ మ్యాచ్ విజయం సాధించామని అతి విశ్వాసానికి వెళ్లకూడదని ఆటగాళ్లకు సూచించాడు. మన టార్గెట్ వరల్డ్ కప్ సాధించాలని, దీనికోసం ప్రతి ఒక్కరు 100 శాతం కృషి చేయాలని సూచించాడు. అనంతరం పాక్ జట్టు కోచ్ ముస్తాక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కప్ పై దృష్టి పెట్టాలని పాక్ ఆటగాళ్లకు సూచించారు.


Latest News
 

పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్ Sat, May 04, 2024, 10:18 AM
ఎవ‌రీ వేముల రోహిత్‌..? Sat, May 04, 2024, 10:09 AM
తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM