చిల్లరు రాజకీయాలు వద్దు : కెసిఆర్

byసూర్య | Mon, Oct 25, 2021, 01:12 PM

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ హాజరై తెరాస జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అమరవీరులను స్మరించుకున్నారు. 20 ఏండ్ల పార్టీ ప్రస్థానంలో తమతో అనేక మంది కలిసి పనిచేశారని అన్నారు. కీర్తి శేషులైన పార్టీ నాయకులకు ప్లీనరీ సంతాపం తెలిపింది. అమరులకు ప్రతినిధుల సభ రెండు నిమిషాలపాటు మౌనం పాటించింది. పార్టీ అధినేతగా సీఎం కేసీఆర్‌ తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ మేరకు ప్లీనరీ వేదికగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. 2001, ఏప్రిల్ 27 స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశ్రయం జలదృశ్యం ఆవరణలో ఈ గులాబీ పతాకాన్ని ఆవిష్కరించాము. ఆనాడు విపరీతమైన అపనమ్మక స్థితి. గమ్యం మీద స్పష్టత లేనటువంటి అగమ్య గోచర పరిస్థితి. ఉద్యమం మీద అప్పటికే ఆవరించుకున్న అనుమానాలు, అపోహాలు, దుష్ప్రచారాలు.. రకరకాల అనుమానాస్పదస్థితుల మధ్య గులాబీ జెండా ఎగిరింది.20 సంవత్సరాల ప్రస్థానం తర్వాత మళ్లీ ఒకసారి అద్యక్ష బాధ్యతలు చేపట్టివల్సిందిగా, ఏగక్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తునన్నారు సీఎం కేసీఆర్. అనేక అవమానాలు ఎదుర్కొని, రాజీలేని పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని, మన పథకాలను ఇతర రాష్ట్రాలు మాత్రమే కాకుండా, కేంద్రం కూడా కాపీ కొడుతుందని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేశారు. టీఆర్ఎస్ కు బాసులు ఎవరూ లేరని.. కేవలం ప్రజలు మాత్రమే టీఆర్ ఎస్ కు బాసులు అంటూ ఉపన్యాసంలో పేర్కొన్నారు.వారి అవసరాలు, డిమాండ్లే అజెండాకు ముందుకు సాగుతున్నామంటూ తెలిపారు. సిపాయిల తిరుగుబాటు విఫలమైంది అని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్ర్యం.. రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది.. ముమ్మాటికీ తెలంగాణ వచ్చి తీరుతుందిని అని నిర్ణయించుకున్నాం. అలా అనేక రకాలుగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాము. సమైక్యవాదులు అనేక అడ్డంకులు సృష్టించారు. చేయని ప్రయత్నం లేదు. వేయని నిందలు లేవు. పెట్టని తిప్పలు లేవు. ఎన్ని జేయాల్నో అన్ని చేశారు. చివరికి రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే ముందు కూడా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారు. మనం కూడా అంతే పట్టుదలతో ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ ముందుకు సాగినం కాబట్టి విజయతీరాలకు చేరి రాష్ట్రాన్ని సాధించుకున్నాం.తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఉద్యమాలకు కొత్త బాటను చూపాయి. చరిత్రలో తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు శాశ్వతంగా కీర్తి ఉండిపోతుంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దళిత బంధుపై పెడుతున్న పెట్టుబడి రూ.లక్షా 70 వేల కోట్లు అంటూ చెప్పారు. దళిత బంధు పథకం గురించి ఏపీ నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. త్వరలోనే రాష్ట్రం మొత్తం అమలు చేస్తామన్నారు. ఏడేళ్లు క్రితం తెలంగాణ ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి తెలియజేశాడు. మరోవైపు ప్లీనరీ సమావేశానికి వచ్చే ప్రజాప్రతినిధులకు పార్కింగ్ ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో ఏకంగా 50 ఎకరాలు కేటాయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాలకు ఒకచోట, కార్యకర్తల వాహనాలకు మరోచోట పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అలాగే హైటెక్స్‌ పరిసరాలలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM