తెలంగాణ – ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌

byసూర్య | Mon, Oct 25, 2021, 01:34 PM

మావోయిస్టులకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా పోలీసులు చేపడుతున్న చర్యలతో ఎదురుదెబ్బ తలగులుతోంది. తాజాగా తెలంగాణ – ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఏకే-47, ఇతర రైఫిల్స్‌, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మృతుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత ఉన్నట్లు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌ బీజాపూర్‌ జిల్లా తర్లగూడ ఈటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది.కాగా, ఇటీవల మావోయిస్టు అగ్రనేత ఆర్క్‌ అనారోగ్యంతో మృతితో పార్టీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆర్క్‌ కోల్పోవడం పార్టీకి తీరని లోటు మిగిలిపోయింది. ఇటీవల కాలంలో తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టులు కదలికలు ఎక్కువ కావడంతో పోలీసు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. అప్పటి నుంచి వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతంలో మావయిస్టుల కదలికలు మరింతగా ఎక్కువ కావడంతో వారిని ఏరివేతలో భాగంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM