డీఆర్డీఓ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.54,000.. దరఖాస్తుకు రెండు రోజులే అవకాశం

byసూర్య | Sun, Oct 24, 2021, 09:46 PM

డీఆర్డీఓకు చెందిన సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్ అండ్ సైన్స్ (Centre for High Energy Systems and Sciences) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా వివిధ విభాగాల్లో 08 రీసెర్చె అసోసియేట్‌, జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారు సీహెచ్ఈఎస్ఎస్ (CHESS) కార్యాలయం హైదరాబాద్‌లో పని చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రారంభ తేదీ అక్టోబర్ 07, 2021. దరఖాస్తుకు అక్టోబర్ 28, 2021 వరకు అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ.54,000 అందించనున్నారు. నోటిఫికేషన్, దరఖాస్తు విధానం కోసం అధికారిక వైబ్‌సైట్‌ https://www.drdo.gov.in/careers ను సందర్శించాలి.


ఖాళీల వివరాలు


పోస్టు పేరు ఖాళీల వివరాలు


ఆర్ఏ (ఫిజిక్స్‌) 01


ఆర్ఏ (ఫిజిక్స్‌) 01


జేఆర్ఎఫ్ 05


జేఆర్ఎఫ్ మెకానికల్‌ 01


 


ముఖ్యమైన సమాచారం


- నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలు తప్పని సరిగా ఉండాలి.


- గేట్‌, నెట్ స్కోర్ ఉండాలి.


- జూనియర్ రీసెర్చ్ ఫెలో చేస్తున్న వ్యక్తి నిబంధనలకు అనుగుణంగా పీహెచ్‌డీ(Phd) చేయవచ్చు.


- దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయసు 35 ఏళ్లు మించరాదు.


- ఎంపికైన వారికి నెలకు రూ.31,00 నుంచి రూ.54,000 వరకు జీతం చెల్లిస్తారు.


- అభ్యర్థి అకడమిక్ మెరిట్‌, వృత్తి అనుభవం ద్వారా ఎంపిక చేస్తారు.- షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థిని ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేస్తారు.


దరఖాస్తు చేసుకొనే విధానం..


Step 1 : దరఖాస్తు చేసుకోవాలనుకొన్న అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా(Bio Data)తో ఫాంను రూపొందించి సంతకం చేయాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)


Step 2 : వారి విద్యార్హతల సర్టిఫికెట్ సాఫ్ట్ కాపీ(Soft copy)లను తయారు చేసుకోవాలి.


Step 3 : ఈ సాఫ్ట్ కాపీని hrd@chess.drdo.in మెయిల్ ఐడీ(Mail Id)కి పంపాలి.


Step 4 : అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి తదుపరి రౌండ్‌కి ఎంపిక చేస్తారు.


Step 5 : వాక్ ఇన్ లేదా వీడియో ఇంటర్వ్యూ అనేది సంస్థ నిర్ణయిస్తుంది.


Step6 : ఇంటర్వ్యూకి పిలిచిన అభ్యర్థులకు టీఏ/డీఏ(TA/DA)లు సంస్థ చెల్లించదు.


Step 7 : ఎంపికైన వారికి వ్యక్తిగతంగా మెయిల్ వస్తుంది.


Step 8 : ఈ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 28, 2021 వరకు అవకాశం ఉంది.


Latest News
 

మంచిర్యాల జిల్లాలో వడదెబ్బతో ఇద్దరి మృతి Thu, May 02, 2024, 05:01 PM
ఈవీఎంల అనుబంధ ర్యాండమైజేషన్ పూర్తి: జిల్లా కలెక్టర్ Thu, May 02, 2024, 04:56 PM
దేశం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ను గెలిపించాలి Thu, May 02, 2024, 04:50 PM
పెద్దమందడిలో బిఆర్ఎస్ నాయకుల ప్రచారం Thu, May 02, 2024, 04:33 PM
క్షణికావేశంలో భార్యను చంపిన భర్త Thu, May 02, 2024, 04:31 PM