ప్రభుత్వం గుడ్‌న్యూస్, కొత్తగా 4లక్షల రేషన్ కార్డులు కు గ్రీన్‌సిగ్ల్‌

byసూర్య | Wed, Jun 09, 2021, 09:39 AM

తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి పేదల పట్ల తన గొప్ప మనుసు చాటుకున్నారు. పలు కారణాలతో పెండింగ్‌లో ఉన్న కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొత్తగా దాదాపు నాలుగున్నర లక్షలమందికి రేషన్‌ కార్డులు అందనున్నాయి. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు రేషన్‌కార్డులు మంజూరు చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ కార్డుల కోసం 4లక్షల 46వేల 168 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దరఖాస్తులన్నింటికీ 15 రోజుల్లోగా రేషన్‌ కార్డులు ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రివర్గం సంబంధిత అధికారులను ఆదేశించింది. దీంతో నాలుగున్నర లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే రాష్ట్రంలో 87.43 లక్షల రేషన్‌ కార్డులున్నాయి. వీటి వల్ల సుమారు 2.83 కోట్ల మందికి లబ్ధి కలగనుంది.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM