సిద్దిపేటలో రూ. 5 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు పట్టివేత

byసూర్య | Fri, Jun 04, 2021, 02:22 PM

సిద్దిపేట  జిల్లాలోని ములుగు మండలం శ్రీరాంపూర్‌లోని సిగ్నెట్ కంపెనీలో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి సోదాలు నిర్వహించారు. రూ. 5 కోట్ల విలువైన 2,384 కిలోల నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ వెల్లడించారు. నకిలీ విత్తనాల కట్టడికి ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని సీపీ తెలిపారు. నకిలీ విత్తనాలు, పురుగు మందుల నివారణకు జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM