ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్‌కు ఈటల రాజీనామా?

byసూర్య | Thu, Jun 03, 2021, 03:45 PM

ఈ నెల 8న మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు సన్నాహకాలు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్‌కు శుక్రవారం ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం జరుతోంది. రాజీనామా కంటే ముందే ఈటలను సస్పెండ్‌ చేసే యోచనలో టీఆర్‌ఎస్‌ ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక అనుచరులతో ఈటల సమాలోచనలు చేస్తారు. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ ఉమ బీజేపీలో చేరుతున్నట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. బీజేపీ అగ్రనాయకత్వంతో భేటీ అయిన ఈటల రాజేందర్‌ గురువారం హైదరాబాద్‌ రానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గత నెల 30న ఏనుగు రవీందర్‌రెడ్డితో కలిసి ఈటల ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. తమ పార్టీ నియమావళి ప్రకారం, ఏ నాయకుడైనా పదవికి రాజీనామా చేసిన తర్వాతే చేరాల్సి ఉంటుందని బీజేపీ నేత బండి సంజయ్ చెప్పారు. ఈటల రాజేందర్‌ సైతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే తమ పార్టీలో చేరుతారని ఆయన స్పష్టం చేశారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM