సీఎం కేసీఆర్ దంపతుల పెన్సీల్ స్కెచ్.. ఫిదా అయిన కేటీఆర్ తనయుడు

byసూర్య | Thu, Jun 03, 2021, 04:05 PM

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన సతీమణి శోభా దంపతుల పెన్సీల్ స్కెచ్ పెయింటింగ్ పట్ల వారి మనమడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు సంతోషం వ్యక్తం చేశారు. పెయింటింగ్ అద్భుతంగా ఉందంటూ సంబరపడిపోయారు. పెయింటింగ్ గీసిన వారికి హిమాన్షు థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు ఆ ఫోటోను హిమాన్షు ట్వీట్ చేశారు. ఈ పెన్సీల్ స్కెచ్ పెయింటింగ్‌ను కరీంనగర్ జిల్లాకు చెందిన కలికోట వెంకటాచారి వేశారు. పెన్సీల్‌తో గీసిన ఈ ఆర్ట్‌ను తొలుత కలికోట వెంకటాచారి ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ఆ తరువాత యర్రోజు చందు అనే వ్యక్తి ఆ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్, ఆయన తనయుడు హిమాన్షుకు ట్యాట్ చేస్తూ రీట్వీట్ చేశారు. దాంతో ఆ పెన్సీల్ ఆర్ట్ కాస్తా హిమాన్షు కంట పడటంతో వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈ పెయింట్ అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. ఆ పెయింటింగ్‌ను హిమాన్షు సైతం రీట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణ శోభ చిరునవ్వులు చిందిస్తూ ముచ్చటిస్తున్నట్లుగా ఉన్న ఈ పేయింటింగ్‌పై నిటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM