ఆత్మహత్యలతో ఉద్యోగాలు రావు: శ్రవణ్
 

by Suryaa Desk |

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు నిరుద్యోగుల శాపం తగులుతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. గాంధీభవన్ లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..ఆత్మహత్యలతో ఉద్యోగాలు రావని ప్రాణాలతో ఉంటూ కేసీఆర్‌తో పోరాడి సాధించుకుందామని దాసోజు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు చేయడం లేదని మానసిక క్షోభకు గురై ఆత్మహత్యయత్నానికి పాల్పడి నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సునీల్‌ను ఆయన పరామర్శించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళనకరమని తెలిపారు. సునీల్‌కు జరగరానిది జరిగితే అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అవుతుందన్నారు.


Latest News
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM
మాస్కులు వాడేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి Sat, May 08, 2021, 12:06 PM