బాలికపై కామాంధుడి అత్యాచారయత్నం...!
 

by Suryaa Desk |

మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మండలం బోడ్రాయి తండాలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన తేజవత్ గోబాల్(55) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక వివరాలు ప్రకారం.. మిర్చి కళ్ళం వద్దకు వెళ్ళి వస్తుండగా ఈ దారుణానికి ప్రయత్నించాడు. బాలిక తన ఇంటి ముందు నుంచి వెళుతున్న క్రమంలో బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకు వెళ్ళిన కామాంధుడు బలత్కారానికి ప్రయత్నిస్తున్న క్రమంలో బాలిక తప్పించుకుని బయటపడింది. సీసీ కెమెరాలో కామాంధుడు ఇంటి నుంచి బాలిక ఏడుస్తూ బయటికొస్తున్న వీడియో ఆధారంగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు కామాంధుడికి స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM