హైకోర్టు కీలక నిర్ణయం
 

by Suryaa Desk |

హైదరాబాద్ ఎన్టీఆర్ మైదానంలో ఏప్రిల్ 1న తలపెట్టిన గో మహాగర్జనకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్, టిటిడి సభ్యుడు శివకుమార్ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. అత్యవసర వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు పిటిషన్​పై విచారణ చేపట్టింది. కొవిడ్ తీవ్రత కారణంగా అనుమతి రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమతిచ్చారన్న కారణంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటామని పిటిషనర్ తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం 400 మందికి మించకుండా కార్యక్రమం నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది. కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది.


Latest News
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM
మాస్కులు వాడేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి Sat, May 08, 2021, 12:06 PM