అఖిలప్రియే కిడ్నాప్ సూత్రధారి: సీపీ అంజినీకుమార్

byసూర్య | Mon, Jan 11, 2021, 04:03 PM

బోయిన్‌పల్లిలో కిడ్నాప్ కేసులో అసలు సూత్రధారి అఖిలప్రియేనని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. కిడ్నాప్ కేసును ఛేదించి ఆధారాలను సీపీ అంజనీకుమార్ మీడియాకు వివరించారు. అఖిలప్రియే కిడ్నాప్ సూత్రధారి సీపీ అంజనీమార్ వెల్లడించారు. ఫేక్ నెంబర్ ప్లేట్‌లతో సంఘటనా స్థలానికి నిందితులు వెళ్లారని తెలిపారు. నిందితుల సెల్‌ఫోన్లు, కార్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. కిడ్నాప్ కి పాల్పడిన నిందితులు మియాపూర్‌లోని సెల్ ఫోన్ షాపులో సిమ్ కార్డులు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
ఈ కిడ్నాప్ కేసులో ఏపీ మాజీమంత్రి అఖిలప్రియ రిమాండ్‌ ఖైదీగా ఉన్నారని తెలిపారు. కిడ్నాప్‌ ఘటనలో నిందితులు 6 సిమ్‌ కార్డులు వాడినట్లు వివరించారు. అపహరణ సమయంలో వాహనాలకు నకిలీ నంబర్‌ ప్లేట్లు బిగించారన్నారు. నిందితులు మల్లిఖార్జున్‌రెడ్డి, మాదాల శ్రీను పేర్లతో సిమ్‌కార్డులు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. ఈ సిమ్‌ నంబర్‌ను అఖిలప్రియ కూడా ఉపయోగించారని స్పష్టం చేశారు. అఖిలప్రియ అనుచరుడు సంపత్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు చెప్పుకొచ్చారు.
కిడ్నాప్ కి ముందు నిందితులు రెక్కీ నిర్వహించారని మీడియాకు వివరించారు. అఖిలప్రియ ఆదేశాలతోనే ప్రవీణ్‌రావు ఇంటి వద్ద నిందితులు రెక్కీ నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు. కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని..అలాగే నిందితుల మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణను మ్యాప్‌ ద్వారా సీపీ అంజనీకుమార్ వివరించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM