5 సవరణలకు ఆమోదం తెలిపిన తెలంగాణ అసెంబ్లీ

byసూర్య | Tue, Oct 13, 2020, 02:54 PM

జీహెచ్ఎంసీ చట్ట సవరణ కోసం తెలంగాణ అసెంబ్లీ ఈరోజు ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్బంగా చట్ట సవరణ బిల్లును మంత్రి కేటీఆర్ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చించిన తర్వాత మొత్తం ఐదు సవరణలకు సభ ఆమోదం తెలిపింది.


సభ ఆమోదం తెలిపిన ఐదు సవరణలు ఇవే:


జీహెచ్ఎంసీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు


జీహెచ్ఎంసీ పరిధిలో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కు ఆమోదం


10 ఏళ్లకు ఒకసారి మాత్రమే రిజర్వేషన్ల మార్పు


నాలుగు రకాల వార్డు వాలంటీర్ల కమిటీలకు సభ ఆమోదం. ఈ కమిటీలలో యూత్ కమిటీ, మహిళా కమిటీ, సీనియర్ సిటిజెన్ కమిటీ, ఎమినెంట్ సిటిజెన్ కమిటీలు ఉన్నాయి.


ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సంప్రదించాలనే సవరణకు ఆమోదం.


అసెంబ్లీలో జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ పోచారం తెలపారు. సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.


Latest News
 

రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM
నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి Tue, May 07, 2024, 09:58 PM
జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM