కేసిఆర్ అధికారంలోకి వచ్చాకనే ప్రతి కులానికి సముచిత గౌరవం : ఎర్రబెల్లి

byసూర్య | Sun, Oct 11, 2020, 03:26 PM

దేశ చరిత్రలో ఇప్పటివరకు ముదిరాజ్ లకు ఆత్మ గౌరవం కల్పించింది సీఎం కేసీఅర్ అని  రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ రాకముందు ముదిరాజ్ లను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదన్నారు. సీఎం కేసిఆర్  అధికారంలోకి వచ్చాకనే ప్రతి కులానికి సముచిత గౌరవం కల్పించారన్నారు. 60 యేండ్లు అణచబడ్డ తెలంగాణ స్వరాష్ట్రం సాధించినంక రాష్ట్రం బంగారు తెలంగాణ గా మారుతుంది. ముదిరాజ్ లు ఇతర దేశాలకు చేపలను ఎగుమతి చేసి పారిశ్రామికవేత్త లుగా ఎదగాలన్నారు.


వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గల సోమిడి చెరువులో ఆదివారం చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ బండ ప్రకాష్, మేయర్ గుండా ప్రకాష్ రావు తదితరులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేప విత్తనాల్ని వదిలారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రా ్రష్టంలో అన్నీకులాలకు సముచిత ్రపాధాన్యత ఉందని తెలిపారు.


ప్రభుత్వచీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ సమైక్య పాలనలో తీవ్రంగా అణచబడ్డ ముదిరాజ్ లు ఇప్పుడు స్వరాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతుకుతున్నారు అంటే కేవలం కేసీఅర్ వల్లే నని అన్నారు. మంత్రి ఎర్రబెల్లి గారితో కలిసి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ముదిరాజ్ లు పాల్గొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM