పంజాబ్‌ని చిత్తుగా ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్

byసూర్య | Fri, Oct 09, 2020, 09:17 AM

ఐపిఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుతో (జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్  69 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్  నిర్ధేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన పంజాబ్  మరో 3 ఓవర్లు మిగిలి ఉండగానే 132 పరుగులకే ఆలౌట్ అయింది. ఆరంభంలోనే తడబడిన పంజాబ్ ఆటగాళ్లు.. పెద్దగా పరుగులు రాబట్టకుండానే పెవిలియన్ బాటపట్టారు. ఆ ఒరవడి అలా చివరి వరకు కొనసాగుతూ వచ్చింది. 


నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన నికోలస్ పూరన్ ( Nicholas Pooran 77; 37 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు ) మాత్రం దాదాపు చివరి వరకు ఒంటరి పోరాటం చేస్తూ వచ్చాడు. కానీ అతడి దూకుడుకి రషీద్ ఖాన్ తన బంతితో అడ్డుకట్ట వేయడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ స్కోర్ బోర్డ్ మళ్లీ వేగం తగ్గింది. 14.5వ ఓవర్ వద్ద జట్టు స్కోర్ 126 గా ఉన్నప్పుడు రషీద్ ఖాన్ బౌలింగ్‌లో తంగరసు నటరాజన్‌కి క్యాచ్ ఇచ్చి పూరన్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సరిగ్గా రెండు ఓవర్లలోనే మరో ఆరు పరుగులకే ముగ్గురు ఆటగాళ్లు ఔట్ అయ్యారు. దీంతో కేవలం 132 పరుగులకే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చాప చుట్టేసింది. సన్‌‌రైజర్స్ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ మూడు వికెట్లు తీయగా ఖలీల్‌ అహ్మద్‌, నటరాజన్‌ చెరో రెండు వికెట్లు సాధించారు. అభిషేక్‌ శర్మ ఒక వికెట్ తీశాడు. Also read : IPL 2020: హైదరాబాద్ వర్సెస్ పంజాబ్..ఎవరి బలమెంత?


 


బ్యాటింగ్ విషయానికొస్తే.. కెప్టేన్ డేవిడ్ వార్నర్  52 పరుగులు; 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ శతకం సాధించి.. ఐపిఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై వరుసగా తొమ్మిదో హాఫ్‌ సెంచరీని నమోదు చేసుకున్నాడు. దీంతో 2015 నుంచి 2020 వరకు పంజాబ్‌పై ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ హాఫ్‌ సెంచరీలు చేసిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్‌ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. 


మరో ఓపెనర్ బెయిర్‌ స్టో 97 పరుగులు ; 55 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) స్కోర్‌ను పరుగులెత్తించాడు. దూసుకెళ్తున్న బెయిర్‌స్టో పంజాబ్ స్పిన్నర్ రవి బిష్ణోయి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అవడంతో 3 పరుగుల తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన ఆటగాళ్లంతా తక్కువ బంతుల్లోనే స్వల్ప స్కోరుకే ఔట్ అయ్యారు. ఒక్కే కేన్ విలియమ్సన్  20  (10 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ ) తప్ప మిగతా ఎవ్వరూ ఆ మాత్రం కూడా రాణించలేదు. పంజాబ్ బౌలర్ రవి బిష్ణోయ్‌ మూడు వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు, మహ్మద్ షమి మరో వికెట్ తీసుకున్నారు.


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM