నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం

byసూర్య | Fri, Oct 09, 2020, 10:32 AM

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున కల్వకుంట్ల కవిత పోటీలో ఉన్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 824 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో 483 మంది, కామారెడ్డిలో 341 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 67 మంది ఓటర్లు ఉండగా, చందూర్ మండల పరిషత్లో అత్యల్పంగా నలుగురు ఓటర్లు ఉన్నారు. ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటేయనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 12న ఫలితాలు వెలువడనున్నాయి.


 


 


 


Latest News
 

ఎమ్మెల్సీ ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి Thu, Mar 28, 2024, 04:06 PM
పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలి Thu, Mar 28, 2024, 04:04 PM
ఆడకూతురు పెండ్లికి అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం Thu, Mar 28, 2024, 04:02 PM
రుణాలను, సేవలను సద్వినియోగం చేసుకోవాలి: డీసీసీబీ డైరెక్టర్ Thu, Mar 28, 2024, 04:01 PM
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు ఖాయం: ఎమ్మెల్యే మేఘారెడ్డి Thu, Mar 28, 2024, 03:57 PM