రేషన్ పంపిణీపై సమీక్ష

byసూర్య | Sat, Apr 04, 2020, 02:41 PM

రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నెల ఒకటవ తేదీ నుండి కేవలం మూడు రోజుల్లో 22 లక్షల కుటుంబాలు 88 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకున్నాయని ఒక ప్రకటన విడుదల చేసారు. మొత్తం 87.59 లక్షల కుటుంబాల్లో మూడు రోజుల్లో 25% మంది రేషన్ బియ్యం తీసుకున్నారని తెలిపారు. శనివారం ఉదయం నుండి ఇప్పటి వరకు (12 గంటల వరకు) నాలుగున్నర లక్షల మంది బియ్యం తీసుకున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లో రేషన్ పంపిణీ సాఫీగా సాగుతోందన్నారు.హైదరాబాద్ లో 5.80 లక్షలు, రంగారెడ్డిలో 5.24 లక్షలు, మేడ్చల్ లో 4.95 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లో దాదాపు 16 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అదే విధంగా రేషన్ పోర్టబిలిటీ లబ్ధిదారుల లావాదేవీలు కూడా ఇక్కడే అధికంగా జరుగుతున్నందున కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. శనివారం ఉదయం నుండి కమిషనర్.. అధికారులు, ఎస్ఏసీ, ఎ డీసీ అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. టోకెన్ తీసుకున్న లబ్దిదారులు మాత్రమే రేషన్ షాపులకు వచ్చి బియ్యం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM