అల్లం టీ తాగుతున్నారా? అయితే మీరు సేఫ్..!

byసూర్య | Sat, Apr 04, 2020, 10:42 AM

అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే వంటల్లో విరివిగా వాడతారు. దీనిలోని మానవ శరీరానికి ఉపయోగపడే ఎన్నో గొప్పగుణాలున్నాయి. దీంతో అనేక ఔషధాల తయారీలోనూ దీనిని వాడతారు. అయితే, ఇన్ని అద్భుత గుణాలున్న అల్లంతో టీ చేసుకుని తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి ఉదయం లేవగానే వికారం, వాంతి వంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యనే పైత్యం అని కూడా అంటారు. అలా బాధపడేవారు రోజూ అల్లం టీని తాగితే సమస్య తగ్గుతుంది. దీన్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. అదే విధంగా అల్లంలోని గొప్ప గుణాలు ఆర్థరైటీస్ వల్ల వచ్చే నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. మరీ ముఖ్యంగా వయసు పైబడిన వారికి ఈ టీ చక్కగా పనిచేస్తుంది. అల్లం టీ గుండె సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. అల్లం రక్తాన్ని పలుచగా చేస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని కూడా చాలా వరకూ తగ్గుతుంది. కాబట్టి రెగ్యులర్‌గా తీసుకుంటే చాలా మంచిది. ఇక ఆడవారిలో వచ్చే నెలసరి సమస్యలకు అల్లం చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. పీరియడ్స్‌ ఓ 4 రోజుల ముందు నుంచే అల్లం టీ తాగడం వల్ల ఆ సమయంలో వచ్చే నొప్పులు చాలావరకూ దూరమవుతాయి. రక్తసరఫరా కూడా కూడా మెరుగవుతుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు కొన్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఇలాంటి వారికి అల్లం టీ మంచి పరిష్కారం. వీటితో పాటు జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడేవారు అల్లం టీని రెగ్యులర్‌గా తాగితే ఆ సమస్యలు తగ్గుతాయి. అల్లంలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి అలర్జీ సమస్యలను దూరం చేస్తాయి. ఈ కారణంగా ఆస్తమా కూడా తగ్గుతుంది. జింజరాల్స్, జింజెరాన్‌లు అనే ప్రత్యేక గుణాలు కలిగిన అల్లం రక్తనాళాల్లో పేరుకున్న అడ్డంకులని తొలగిస్తుంది. టైప్ 2 డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకి షుగర్ లెవల్స్ తగ్గించడంలో అల్లంటీ భేషుగ్గా పనిచేస్తుంది. దీన్ని తాగడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. కాబట్టి రెగ్యులర్‌గా తీసుకోవడం చాలా మంచిది. చాలామంది జీర్ణ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటివారు ఉదయాన్నే అల్లం టీ తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి. అసిడిటీ, పొట్టలో మంట వంటి సమస్యలన్నీ దూరమవుతాయి. ఈ కారణంగా మలబద్ధకం కూడా దూరమవుతుంది. అందుకే కొన్ని అరుగుదలకు ఉపయోగపడే మందుల్లోనూ అల్లంని ఉపయోగిస్తారు. కొన్నిసార్లు పిండివంటలు, నూనె పదార్థాలు తీసుకున్నప్పుడు పొట్టలో ఉబ్బరం, వేవిళ్లు వంటి వాటితో బాధపడతారు. అలాంటప్పుడు అల్లం టీ తాగడమో లేదా అల్లం ముక్కని బుగ్గలో పెట్టుకుని వచ్చే రసాన్ని మింగడమో చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ సమస్యలన్నీ త్వరగా అదుపులోకి వస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో జింజర్ టీ బాగా పనిచేస్తుంది. కాబట్టి వర్షాకాలంలో దీన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఆ సమయంలోనే ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు చుట్టుముడతాయి. ఈ టీ తీసుకుంటే ఎలాంటి సమస్యలు దరిచేరవు. ఇన్ఫెక్షన్లను అడ్డుకుని ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూస్తుంది. చాలామంది అనేక కారణాలతో నోటి దుర్వాసన వంటి, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలతో బాధపడతారు. అలాంటి వారు ఈ టీ తాగితే చాలా వరకూ సమస్య తగ్గే అవకాశం ఉంది. రెగ్యులర్‌గా అల్లంటీ తాగితే అద్భుత ఫలితాలు ఉంటాయి. అల్లంలోని ప్రత్యేక గుణాలు జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. ఈ కారణంగా శరీరంలోని కొవ్వు లాంటి పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. కాబట్టి త్వరలోనే అధికబరువు అదుపులోకి వస్తుంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM