ఓఆర్ఆర్ పై స్పెషల్ బోర్డులు..ఇక స్పీడ్ గా పోతే

byసూర్య | Tue, Oct 15, 2019, 11:02 AM

ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల స్పీడ్ కి బ్రేక్ లు వేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వాహనాల వేగం తెలిసేలా ఓఆర్ఆర్ పై స్పెషల్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. వీటిని యువర్ స్పీడ్ స్క్రీన్ అంటారు. ఆటోమేటిక్ రాడార్ల సాయంతో వాహన వేగాన్ని గుర్తిస్తారు. ఈ చలాన్ జారీ చేస్తారు. ముందుగా రాచకొండ పరిధిలో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే ఓఆర్ఆర్ అంతటా స్క్రీన్లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ స్క్రీన్స్ ద్వారా వాహనాల వేగాన్ని కంట్రోల్ చేయొచ్చని, ప్రమాదాల సంఖ్యను తగ్గించొచ్చని పోలీసులు ఆశిస్తున్నారు.


స్పీడ్ స్క్రీన్స్ వాహనాల వేగాన్ని పసిగట్టడమే కాదు.. వెంటనే ఆ సమచారాన్ని ట్రాఫిక్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి చేరవేస్తుంది. దీంతో వాహనదారులు వెంటనే స్పీడ్ ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొర్రెమెలలో ఓ ప్రైవేట్ సంస్థతో కలిసి పోలీసులు యువర్ స్పీడ్ స్క్రీన్ బోర్డుని ఏర్పాటు చేశారు.


ఓఆర్ఆర్ పై ట్రాఫిక్ పోలీసులు ఎంచుకున్న ప్రాంతాల్లో లేజర్ గన్ కమెరా సాయంతో వాహనదారుల స్పీడ్ ను గమనిస్తున్నారు. ఆయా కెమెరాలతో వేగాన్ని తెలుసుకుని ఈ-చలాన్లు జారీ చేస్తున్నారు. అయితే దీనికి చాలా సమయం పడుతోంది. యువర్ స్పీడ్ స్క్రీన్ బోర్డు అయితే.. ట్రాఫిక్ పోలీసులు లేకున్నా ఆటోమెటిక్ గా రాడార్ల సాయంతో వాహనాల వేగాన్ని గుర్తించి చలాన్ జారీ చేస్తుంది. సిబ్బంది వారి ఆఫీసుల్లోనే ఉండి లేజర్ గన్ కెమెరాలను పర్యవేక్షణ చేయొచ్చు. 


 


ఒక్కో ఆటోమేటిక్ స్పీడ్ లేజర్ గన్ కెమెరా ఖరీదు రూ.25లక్షల నుంచి రూ. 40లక్షల వరకు ఉంటుంది. రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 158 కిమీ రోడ్డు ఉంది. 8 నుంచి 12 లేజర్ గన్ లు అవసరం అవుతాయని చెబుతున్నారు. రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ఓఆర్ఆర్ పై గత మూడేళ్లేలో 10, 05, 196 ఈ-చలాన్లు జారీ చేశారు. ఫైన్ల రూపంలో రూ.122 కోట్లు వచ్చింది. ఓఆర్ఆర్ పై 358 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 100 మంది చనిపోయారు. వందలామంది గాయపడ్డారు. ఓవర్ స్పీడ్ కారణంగా ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. దీంతో స్పీడ్ కి బ్రేక్ వేస్తే ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని పోలీసులు భావిస్తున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM