బెల్లంపల్లిలో సీపీఎం నాయకుల విస్తృతస్థాయి సమావేశాలు

byసూర్య | Fri, Oct 11, 2019, 05:01 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం విస్తృతస్థాయి పోరాటాలు నిర్వహిస్తుందని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని డిగ్రీ కళాశాలలో సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు నిరంకుశంగా పాలిస్తున్నాయని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల సీఎం కేసీఆర్ మొండిగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కే.రవి, జిల్లా నాయకులు ప్రకాష్, పోతు శంకర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM