ప్రయాణికులకు శుభవార్త

byసూర్య | Fri, Oct 11, 2019, 09:07 AM

లింగంపల్లి-విజయవాడ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (12796/12797) రైలు వేగం మరింత పెరగనుంది. ఉదయం 4:40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరే ఈ రైలు 5:30 గంటలకు సికింద్రాబాద్, ఉదయం 10:45 గంటలకు విజయవాడ చేరుకుంటోంది. అయితే, ఇకపై పావుగంట ముందుగానే అంటే 10:30 గంటలకే విజయవాడ చేరుకోనుంది. అయితే, ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది.ఇక తిరుగు ప్రయాణంలో ఈ రైలు సాయంత్రం 5:30 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 11:35 గంటలకు లింగంపల్లి చేరుకుంటోంది. అయితే, ఇకపై 20 నిమిషాలు ముందుగా అంటే 11:15 గంటలకే లింగంపల్లి చేరుకుంటుందని దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.




కొత్త టైంటేబుల్ అమలైతే సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడిచే తొలి వేగవంతమైన రైలుగా ఇది రికార్డులకెక్కుతుంది. సికింద్రాబాద్ నుంచి  ఐదు గంటల్లోనే విజయవాడకు.. తిరుగు ప్రయాణంలో 4:50 గంటల్లోనే సికింద్రాబాద్‌కు చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. కొత్త వేళల ప్రకారం.. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 5:20 గంటలకు బదులుగా 5:25కు బయలుదేరి గుంటూరుకు 20 నిమిషాల ముందుగా అంటే 9:20 గంటలకు చేరుకుంటుంది. మంగళగిరికి 9:42కి, విజయవాడకు 10:30కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ, మంగళగిరి, గుంటూరు స్టేషన్లకు చేరుకునే సమయాల్లో మార్పులు లేవు. సికింద్రాబాద్‌కు మాత్రం రాత్రి 10:35కి బదులు 10:20కే చేరుకుంటుంది. లింగంపల్లికి 11:15 గంటలకు చేరుకుంటుంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM