ఖరీఫ్‌కు 8.50 లక్షల టన్నుల యూరియా

byసూర్య | Fri, Aug 23, 2019, 05:19 PM

ప్రస్తుత ఖరీఫ్‌కు 8.50 లక్షల టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడం, కృష్ణా పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండుగా ఉండడంతో సాగు పెరిగిందని మంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే ఎరువుల వాడకం గణనీయంగా పెరిగిందన్నారు. ఈ పరిస్థతిని ముందే ఊహించినందున కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసినట్లు చెప్పారు. జిల్లాలవారీగా యూరియా డిమాండ్ వివరాలను అందించామన్నారు. కృష్ణపట్నం, విశాఖపట్నం పోర్టుల్లో ఉన్న యూరియాను తెలంగాణ ర్యాక్ పాయింట్లకు తరలించాలని కోరినట్లు నిరంజన్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం వెంటనే యూరియా కోటాను పంపిస్తుందని భావిస్తున్నామని చెప్పారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM