డౌటుంటే సిబిఐ విచారణకు సిద్దమే : ట్రాన్స్‌కో సీఎండీ

byసూర్య | Fri, Aug 23, 2019, 04:28 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అవగాహన లేక విద్యుత్‌ సంస్థలపై ఆరోపణలు చేశారని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు అన్నారు. విద్యుత్‌ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని లక్ష్మణ్‌ చేసిన ఆరోపణలను ట్రాన్స్‌కో ప్రభాకర్‌ రావు ఖండించారు. ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి విద్యుత్‌ కొనుగోళ్లు, ఒప్పందాలపై ప్రభాకర్‌రావు వివరణ ఇచ్చారు. ''రాష్ట్రం ఏర్పడే నాటికి 71 మెగావాట్లు సోలార్‌పవర్‌ ఉండేది. ఇప్పుడు సోలార్‌పవర్‌ 3,600 మెగావాట్లకు పెరిగింది. ఎంతో పారదర్శకంగా విద్యుత్‌ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. ఛత్తీస్‌గఢ్‌ నుంచి రూ.3.90పైసలకు విద్యుత్‌ను కొంటున్నాం. రూ.4.30 పైసలకు విద్యుత్‌ సరఫరా చేస్తామని ఎన్డీపీసీ ఎప్పుడూ చెప్పలేదు. 800 మెగావాట్ల ప్లాంట్‌ను దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సందర్శించారు. విద్యుత్‌ సంస్థలు పూర్తి స్వతంత్రమైనవి. మాపై ఎలాంటి ప్రలోభాలు ఒత్తిళ్లు లేవు. మేం ఎటువంటి ఒత్తిడులకు లొంగడం లేదు. రాత్రికి రాత్రే పీపీఏలు కుదుర్చుకున్నారనడం అవాస్తవం. విద్యుత్‌ ఉద్యోగుల పనితీరుపై అవాస్తవాలు ప్రచారం చేయొద్దు. మా పనితీరుపై అనుమానాలుంటే సీబీఐ విచారణకు కూడా మేము సిద్ధమని ప్రభాకర్‌రావు'' పేర్కొన్నారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM