అమీర్‌పేట్‌-హైటెక్‌సిటీ మెట్రో మార్గం ప్రారంభం

byసూర్య | Wed, Mar 20, 2019, 10:13 AM

హైదరాబాద్‌: అమీర్‌పేట్‌-హైటెక్‌ సిటీ మెట్రో రైల్‌ మార్గం అందుబాటులోకి వచ్చింది. అమీర్‌పేట్‌ ఇంటర్‌ఛేంజ్‌ మెట్రోస్టేషన్‌లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి ఈ మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 10కి.మీ మార్గంలో అమీర్‌పేట్‌తో కలిపి 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. మధురానగర్‌ స్టేషన్‌కు తరుణి మెట్రో స్టేషన్‌గా నామకరణం చేశారు. పూర్తయిన రెండు కారిడార్లతో కలిపి మొత్తం 56కి.మీ మేర మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్యక్రమంలో సీఎస్‌ ఎస్కే జోషీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, మెట్రోరైల్‌ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కారిడార్ 1 మియాపూర్ నుంచి ఎల్బీనగర్ (29 కిలోమీటర్లు) మెట్రో ప్రయాణంలో 45 నిమిషాలు పడుతుంది. ఇదే ప్రయాణం రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే గంట 46 నిమిషాలు పట్టే అవకాశముంది. కారిడార్ జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు(15 కిలోమీటర్లు) మెట్రో ప్రయాణంలో 22 నిమిషాలు పడుతుంది. ఇదే ప్రయాణం రోడ్డు మార్గంలో గంట 10 నిమిషాలు పడుతుంది. కారిడార్ 3 నాగోల్ నుంచి హైటెక్‌సిటీ (27 కిలోమీటర్లు) మెట్రో ప్రయాణంలో 38 నిమిషాలు పడుతుంది. ఇదే ప్రయాణం రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే గంట 26 నిమిషాలు పడుతుంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM