బీజేపీలో చేరిన డీకే అరుణ

byసూర్య | Wed, Mar 20, 2019, 10:11 AM

న్యూఢిల్లీ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్‌కు షాక్. మాజీ మంత్రి డీకే అరుణ కాంగ్రెస్ పార్టీని వీడారు. మంగళవారం రాత్రి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో డీకే అరుణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అరుణకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అమిత్ షా. రాష్ట్రంలో మరోమారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని డీకే అరుణ స్పష్టం చేసింది. అయితే మంగళవారం ఉదయం అరుణ.. హైదరాబాద్‌లోని బీజేపీ నేత రాంమాధవ్ ఇంటికెళ్లి 45 నిమిషాలకు పైగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అరుణ రాజకీయ భవిష్యత్‌పై అమిత్ షా పూర్తి భరోసా ఇచ్చిన తర్వాతనే ఆమె ఢిల్లీ వెళ్లి.. బీజేపీలో చేరారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున డీకే అరుణ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. 


Latest News
 

నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM
బిజెపి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం Sat, Apr 20, 2024, 02:40 PM
ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జననం Sat, Apr 20, 2024, 02:02 PM
నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM