సైరా రాకకు అంతా రెడీ

by సూర్య | Tue, Aug 20, 2019, 12:25 PM

అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సైరా నరసింహారెడ్డి టీజర్ లాంచ్ ఇవాళ అట్టహాసంగా జరగబోతోంది. ముంబైలో జరిగే ప్రెస్ మీట్ ద్వారా దీన్ని విడుదల చేయబోతున్నారు. అతిథులుగా చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్ మరికొందరు ప్రముఖులు ఉండొచ్చని తెలిసింది. అక్కడి నుంచే తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ వెర్షన్ల టీజర్లు ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్టుగా అక్కడి నుంచి వస్తున్న రిపోర్ట్స్ పిక్స్ ని బట్టి తెలుస్తోంది.


టీజర్ నిడివి ఎంత ఉంది ఇందులో ఏ విశేషాలు చూపిస్తారు అనే దాని గురించి లీక్స్ రాకుండా కొణిదెల టీమ్ జాగ్రత్త పడింది. ఇవాళ మధ్యాన్నం 2.30 నిమిషాలకు టీజర్ లాంచ్ ఈవెంట్ జరగబోతోంది. నిర్మాత రామ్ చరణ్ ప్రత్యేక సూచనలతో సీమ ముఖ్యద్వారంగా చెప్పబడే కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్ ని తలపించే ఇంటీరియర్ తో ప్రెస్ మీట్ ప్రాంగణాన్ని సెట్ చేయడం విశేషం సైరా టీజర్ కు సంబంధించి చాలా ప్రత్యేకతలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 


 


ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ లో చిరు విశ్వరూపాన్ని చూసేందుకు అభిమానులు తెగఊవ్విళ్లూరుతున్నారు. చిరు గెటప్ తో పాటు రెండు మూడు పవర్ ఫుల్ డైలాగులు ఇందులో ఉండొచ్చనే అంచనాలు కూడా వాళ్లలో భారీగా ఉన్నాయి. కెజిఎఫ్ హీరో యష్ కన్నడ వెర్షన్ కు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ్ కు మోహన్ లాల్ మలయాళంకు టీజర్ లో స్వరం వినిపించినట్టుగా టాక్ ఉంది. సో ఇవాళ్టి నుంచి ఊపందుకోనున్న సైరా ప్రమోషన్ ని  ముంబైలో ప్రారంభించడం విశేషం. ఎంత ఇంకో నాలుగు గంటలు వెయిట్ చేస్తే చాలు సైరా విశ్వరూపం తాలూకు శాంపిల్ ని టీజర్ లో చూసేయొచ్చు

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM