రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ'

by సూర్య | Fri, Apr 26, 2024, 08:50 PM

గత కొన్నేళ్లుగా సౌత్ ఇండియాలో రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ ట్రెండ్ తెలుగులో పోకిరి సినిమాతో మొదలైంది.తమిళం, మలయాళం, కన్నడ భాషలలో కూడా సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి . కొద్ది రోజుల క్రితం వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా రీరిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా 7.46 కోట్ల గ్రాస్‌తో టాప్‌లో నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సూపర్ హిట్ సినిమా 'గిల్లీ' (ఒక్కడు రీమేక్) తొలిరోజు బ్రేక్ చేసింది. ఐదు రోజుల్లో ఈ సినిమా 17.70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అరుదైన ఘనత సాధించింది. దీంతో ఇప్పుడు రీరిలీజ్ సినిమాల కలెక్షన్స్ పరంగా 'గిల్లీ' సినిమా అగ్రస్థానానికి ఎగబాకింది. విజయ్ గిల్లీ' సినిమా తమిళనాడు, కేరళ, లండన్, తెలంగాణ ఇలా అని చోట్ల రీ-రిలీజ్అ యి రికార్డు సృష్టించింది. 

Latest News
 
'డార్లింగ్' లో తన భాగాన్ని పూర్తి చేసుకున్న నభా నటేష్ Tue, May 07, 2024, 04:31 PM
త్వరలో ఆహాలో మెరవనున్న 'విద్యా వాసుల అహం' Tue, May 07, 2024, 04:29 PM
'మైదాన్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Tue, May 07, 2024, 04:27 PM
'పుష్ప' నా కోసం ఏమీ చేసిందని నేను అనుకోను - ఫహద్ ఫాసిల్ Tue, May 07, 2024, 04:05 PM
బజ్ : ఆర్యన్ ఖాన్ యొక్క 'స్టార్‌డమ్' డిజిటల్ రంగప్రవేశం అప్పుడేనా Tue, May 07, 2024, 04:02 PM