20న 'సైరా' టీజర్‌ విడుదల

by సూర్య | Mon, Aug 19, 2019, 05:47 PM

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా సైరా. 151వ సినిమాగా చిరంజీవి టైటిల్‌ రోల్‌ పోషించారు. సినమా టీజర్‌ను చిరు పుట్టిన రోజున ఆగస్టు 22న విడుదల చేస్తారన్న కథనాలు నిన్నటి వరకూ వినిపించాయి. అయితే నిర్మాత రామ్‌చరణ్‌ టీజర్‌ రిలీజ్‌ డేట్‌ను సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 20న సైరా టీజర్‌ బయటకు రాబోతుంది. టీజర్‌కు ఇక రెండు రోజులే ఉందంటూ ఓ అట్రాక్టివ్‌ పోస్టర్‌ను సైతం షేర్‌ చేశారు. కొణిదెల ప్రొడక్షన్స్‌పై సైరా ను దర్శకుడు సురేందర్‌ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించాడు. బాలీవుడ్‌, సౌత్‌ స్టార్‌ ఆర్టిస్టులు అమితాబ్‌ బచ్చన్‌,విజయ్‌ సేతుపలి, జగపతి బాబు, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నా. స్పెషల్‌ అట్రాక్షన్‌గా చిరంజీవి సోదరుడు పవన్‌ కల్యాణ్‌ ఈ చిత్రానికి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. పోస్ట్‌ ప్రొడక్షన్స్‌లో వున్న ఈ సినిమా అక్టోబర్‌ 2 గాంధీ జయంతి రోజున థియేటర్లకు రానుంది

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM