by సూర్య | Wed, Jun 26, 2024, 02:50 PM
అజయ్ భూపతి దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన 'మంగళవరం' సినిమా నవంబర్ 17, 2023న థియేట్రికల్ విడుదల అయ్యింది. ఈ సినిమా జూన్ 26న మధ్యాహ్నం 04:00 గంటలకు స్టార్ మా ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను ప్రదర్శించనుంది. ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ గోష్, శ్రవణ్ రెడ్డి, శ్రీతేజ్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. విలేజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకి కాంతారావు ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఎ క్రియేటివ్ వర్క్స్ మరియు ముద్ర మీడియా వర్క్స్ పతాకాలపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Latest News