by సూర్య | Wed, Jun 26, 2024, 02:52 PM
నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన 'మహారాజా' సినిమా తెలుగు వెర్షన్ జూన్ 14, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జులై 19, 2024న ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించనున్నారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ మరియు థింక్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News