by సూర్య | Wed, Jun 26, 2024, 02:48 PM
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పూర్తి వినోదాత్మక చిత్రం కోసం జతకట్టనున్నారు. ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ లో రానున్నట్లు సమాచారం. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాని జులై 3న లాంచ్ చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఈ చిత్రానికి "సంక్రాంతికి వస్తున్నాం" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ రిజిస్టర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని సమాచారం. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించనున్నారు.
Latest News