నవంబర్‌ 1న ఓటీటీలోకి 'విశ్వం' ?

by సూర్య | Wed, Oct 30, 2024, 12:30 PM

గోపీచంద్‌ సినిమాలు  గత కొంత కాలంగా భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కావటంలేదు. ఆయన చేస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పడుతూ  వస్తోంది. మరో ప్రక్క శ్రీనువైట్ల దూకుడు తర్వాత ఇప్పటి వరకు హిట్ కొట్టలేదు. పదేళ్లుగా ఆయన తీస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అవుతూనే ఉన్నాయి. అయినా ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. ఈ క్రమంలో గోపీచంద్‌ హీరోగా శ్రీనువైట్ల 'విశ్వం' ను రూపొందించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గతంలో తాను చేసిన తప్పులను సరిదిద్దుకుని ఈ సినిమాను రూపొందించా అంటూ ప్రమోషన్ సమయంలో గట్టిగా చెప్పుకొచ్చారు. అలాగే విశ్వం తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని  ప్రెస్‌మీట్‌లో చెప్పుకొచ్చారు. అయితే రిలీజ్ అయ్యాక ఆ స్పీడు తగ్గిపోయింది. మార్నింగ్ షోకే యావరేజడ్ టాక్ వచ్చేసింది. ఓపెనింగ్‌ కలెక్షన్స్ ఓ మాదిరిగా వచ్చాయి. సినిమా అస్సామే అన్నారు. ట్రైన్ కామెడీ ని రవితేజ వెంకీ స్దాయిలో అన్నారు. కాకపోతే ఆ కాలం నాటి జోక్ లు, పంచ్ డైలాగులతోనే నింపేసారు. కేవలం వెన్నెల కిషోర్ మాత్రమే నవ్వించాడు. మిగతా కామెడీ యాక్టర్స్ కు ఆ మాత్రం ఫన్ కూడా క్రియేట్ చేయలేక చేతులు ఎత్తేసారు.  ఏదైమైనా ఫస్టాఫ్ ని ఫృధ్వీ కామెడీ, ఇంటర్వెల్ బ్లాక్  ఎంతో కొంత కాంపన్సేట్ చేసింది.


సెకండాఫ్ లో ఆ మాత్రం కూడా లేకుండా పోయింది. హీరో ఫ్లాష్ బ్యాక్ , క్లైమాక్స్ లో హీరో,విలన్స్ మధ్య డైలాగ్స్ ఏంటో శ్రీను వైట్ల ఛాదస్తం  అనిపిస్తుంది.  అయితే ఉన్నంతలో కామెడీ బాగుందని టాక్ రావటంతో జనం  ఓటిటి కోసం ఎదురుచూడటం మొదలెట్టారు.  ఈ క్రమంలో ఓటిటి రిలీజ్ విషయం బయిటకు వచ్చింది. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం రైట్స్ ని అమేజాన్ ప్రైమ్ వాళ్లు తీసుకున్నారు. ఈ సినిమాని దీపావళి శెలవు కలిసొచ్చేలా స్ట్రీమింగ్ చేయబోతున్నారనే టాక్ బయిటకు వచ్చింది. అమేజాన్ ప్రైమ్ వాళ్ళు ఈ సినిమా రైట్స్ ని 12 కోట్లుకు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఓటిటి రిలీజ్ విషయమై ఇంకా అఫీషియల్ ఎనౌన్సమెంట్ రావాల్సి ఉంది. ఈ రోజు రావచ్చు అని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. 

Latest News
 
'దేవర పార్ట్ 1' నుండి ఫియర్ సాంగ్ వీడియో సాంగ్ అవుట్ Wed, Oct 30, 2024, 02:52 PM
పెళ్లి చూపుల్లో ఉపాసన.. రామ్ చరణ్‌ని అడిగిన ఫన్నీ ప్రశ్న ఇదే Wed, Oct 30, 2024, 02:51 PM
'అమరన్‌' నుండి ఉయిరేయ్ సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Wed, Oct 30, 2024, 02:49 PM
ప్రొడ్యూస్ వంశి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'క' టీమ్ Wed, Oct 30, 2024, 02:44 PM
'లక్కీ బాస్కర్' ప్రీమియర్స్ కి భారీ రెస్పాన్స్ Wed, Oct 30, 2024, 02:40 PM