by సూర్య | Wed, Oct 30, 2024, 02:52 PM
జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం "దేవర పార్ట్ 1" బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. మిశ్రమ సమీక్షలు ఉన్నప్పటికీ ఈ చిత్రం ఆకట్టుకునే వసూళ్లను సాధించింది. ప్రతి ప్రాంతంలో కొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 509 కోట్లు వాసులు చేసింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఫియర్ సాంగ్ వీడియో సాంగ్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ, ప్రేక్ష రాజ్, అజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతాన్ని అందించారు.
Latest News