by సూర్య | Wed, Oct 30, 2024, 11:59 AM
కంగువా సినిమా విడుదలకు ముందే ఓ విషాధ ఘటన చోటు చేసుకుంది. ఆ సినిమాకు ఎడిటర్‌గా వ్యవహరించిన నిషాద్ యూసఫ్ కన్నుమూశారు.ఈ రోజు ఉదయం కేరళ కొచ్చిలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించాడు. ఇప్పుడు ఈ వార్త సౌత్ సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. నిషాద్ ఆకస్మిక మరణంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా సూర్య హీరోగా రూపొంది మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న 'కంగువా'కు నిషాద్ ఎడిటర్‌గా పని చేశారు.నిషాద్ యూసఫ్ గతంలో మలయాళంలో వచ్చిన బ్లాకబస్టర్ మూవీ టోవినో థామస్ నటించిన 'తల్లుమాల' సినిమాకు గాను ఉత్తమ ఎడిటర్‌గా స్టేట్ అవారర్డు సైతం అందుకున్నాడు. ప్రస్తతుం మమ్ముట్టి హీరోగా వస్తున్న బజూక చిత్రానికి పని చేస్తుండగా ఇప్పుడు ఈ ఘటన సంభవించింది. నిషాద్ మరణాన్ని దృవీకరిస్తూ 'ది ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ డైరెక్టర్స్ యూనియన్' అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఇదిలాఉండగా నిషాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Latest News