స్వార్థము, పరమార్థము రెండు నేనే

by సూర్య | Mon, Jun 17, 2024, 01:17 PM

‘ఒక నేనే... నాకు చుట్టూ నేనే. ఒక్కటైనా ఒంటరోణ్ని కానే. వీరుడినే... యోధుడినే’ అంటున్నారు భైరవ. ఆ కథేంటో తెలియాలంటే కల్కి చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'కల్కి 2898 ఎడీ’. దీపికా పదుకోన్ కథానాయిక. వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలోని భైరవ థీమ్‌ను విడుదల చేశారు. ‘ఒక నేనే... నాకు చుట్టూ నేనే. ఒక్కటైనా ఒంటరోణ్ని కానే. వీరుడినే... యోధుడినే. భూమి నేనే సూర్యుడైన నేనే, నన్ను నేనే చుట్టి తిరుగుతానే, స్వార్థము నేనే పరమార్థము నేనే...’ అంటూ సాగే ఈ పాటను తెలుగు, హిందీ భాషల్లో సాగుతుంది. రామజోగయ్య శాస్ర్తి, కుమార్‌ రచించగా... దిల్జీత్‌ దోసాంజ్‌, దీపక్‌ బ్లూ ఆలపించారు. సంతోష్‌ నారాయణన్‌ స్వరపరిచారు. లిరికల్‌ వీడియోలో ప్రభాస్‌ ఆకట్టుకున్నాయి. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్లు ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే!

Latest News
 
అజిత్‌పై యువ నటుడు చేసిన ట్వీట్ వైరల్ Sat, Oct 26, 2024, 04:18 PM
కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోషూట్ ! Sat, Oct 26, 2024, 04:17 PM
డైరెక్టర్ సుజీత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'OG' టీమ్ Sat, Oct 26, 2024, 04:12 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' గురించిన లేటెస్ట్ అప్డేట్ Sat, Oct 26, 2024, 04:06 PM
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి ఐశ్వర్య రాజేష్ Sat, Oct 26, 2024, 03:59 PM